a456

456

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును బ్రభువా ||సంత||

  1. సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతో బరమ సౌఖ్యము బొంద భక్తితో సేవింతు ||సంత||

  2. నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోచదు సారెసారెకు దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంత||

  3. కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునగల యాస్తికై నా చిత్త మాలసింపగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంత||

  4. ఈ యుర్వి నేజేయు సేవకు ఫలములు నీ చోట గనుగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు ||సంత||

Post a Comment

أحدث أقدم