a414

414

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగ జేసితివి ||నీవే||

  1. పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||

  2. నీవే నను బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||

  3. నేనెవరి బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||

  4. నీ సేవ నే గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||

  5. సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కగం చేయుదువు ||నీవే||

  6. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||

Post a Comment

కొత్తది పాతది