a400

400

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసు||

  1. లోక జ్ఞానములోని లోతు దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసు||

  2. దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||

  3. శుభవర్తమానము సొంపుగా నరులకు జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||

  4. నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||

  5. శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసు||

Post a Comment

కొత్తది పాతది