400
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- లోక జ్ఞానములోని లోతు దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసు||
- దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||
- శుభవర్తమానము సొంపుగా నరులకు జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||
- నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||
- శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసు||
إرسال تعليق