a402

402

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దినదినముకు దిక్కు నీవే మా దేవుడా మమ్ము కనిపెట్టి కాపాడ నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||

  1. పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతో గావు మమ్ము గావు మమ్ము ||దినదినమునకు||

  2. పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ము భట్టి రక్షింప వచ్చిన బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||

  3. కష్టములు కాని శోధనలు మమ్ము జుట్టు కొనగ నీ కృపనెంతో చూపుదువే చూపుదువే ||దినదినమునకు||

  4. నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందబోవు కాలమందు దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||

  5. సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||

  6. ఆస గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||

  7. విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగ బంపించుమీ శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు||

Post a Comment

أحدث أقدم