a406

406

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు||

  1. అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ యది యనుసరించినావ అది యరసి చూచినావ? ||మనసు||

  2. అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు||

  3. రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు||

  4. ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు||

  5. సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు||

  6. వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు||

Post a Comment

أحدث أقدم