a405

405

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదు డాపదల స హాయుడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||

  1. పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుడే||

  2. దేవు డెప్డు తోడుగాగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుడే||

  3. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరి బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుడే||

  4. విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుడే||

  5. పిశాచి పూర్ణబలము నాతో బెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుడే||

  6. కోటయు నాశ్రయమునై యా కోబు దేవు డుండగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకు బండుగ యభయ మభయ మభయ ||దేవుడే||

Post a Comment

أحدث أقدم