a404

404

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము గలిగిన ప్రభుని కడకు జేరరాదా ||జడియకుము||

  1. ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు బొందరాదా ||జడియకుము||

  2. ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము||

  3. బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ మానసమున పాదుకొనలేదా యత డాదరింపబడిన విధము మోద మియ్యలేదా ||జడియకుము||

  4. మున్ను సైఫనును రాళ్లతో గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపున జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చ బ్రభువు తెన్ను జూపలేడా ||జడియకుము||

  5. భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా సక్తి నుండలేదా ||జడియకుము||

Post a Comment

أحدث أقدم