A401

401

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వెరువనేల మనసా క్రీస్తుని వేడవే నా మనసా యిరుకున బడి యెడు వేళలో క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది ||వెరువ||

  1. శోధన కాలమున క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా తానుని వల మరి ఛేదించెడు నిక బెదరకు ||వెరువ||

  2. పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తా దెచ్చి పాప మెడలు నని తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను ||వెరువ||

  3. గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను ||వెరువ||

  4. గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే ||వెరువ||

  5. లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని బల్కరుణను బిలువగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుడై ||వెరువ||

  6. పరిసయ్యునిలోని భావము ప్రభు తా గనుగొనుచు తిరిగి పొమ్ము నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ||

Post a Comment

కొత్తది పాతది