4
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవి బడి దారి గనని నను జేరబిలిచితివి ||దేవా||
అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||
సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా దెందము కడుదెలి వొంద జేసి నీ యందు నిలుప గదె ||దేవా|
ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుడ నధముడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి