a3

3

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు నాయకుడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగద్రోతునని బాసలు జేసిన ప్రభుడవు నీవెగా ||యేసు||

  1. రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా ||యేసు||

  2. హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునబెంచుము మాపాలకుడవో ||యేసు||

  3. మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||

  4. చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముడ నీ దయ మరువశక్యమా ||యేసు||

Post a Comment

కొత్తది పాతది