a2

2

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    గానము జేయుడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్త గాను రక్తిగను ||గానము||

  1. తన్నామము నుతించి యతని రక్ష జెన్నుగ సారె బ్రసిద్ధము జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||

  2. ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||

  3. పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతి గొనుచు నుండండి ||గానము||

  4. పరిపాలించుచున్నాడనుచు తోడి నరులతోజెప్పుడిద్ధర గదకుండ స్థిరముగ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||

  5. ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||

  6. జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతో గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||

Post a Comment

కొత్తది పాతది