a4

4

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా||

  1. సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవి బడి దారి గనని నను జేరబిలిచితివి ||దేవా||

  2. అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||

  3. సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా దెందము కడుదెలి వొంద జేసి నీ యందు నిలుప గదె ||దేవా|నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవు డవు క్రీస్తు యేసుని చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను గేవల మొక్కడ వై వెలిగెడి ప్రభు ||దేవా||

  4. ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుడ నధముడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా||

Post a Comment

أحدث أقدم