21
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్ల దలంచెదను ||త్రిత్వమై||
వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్ల గాచి రక్షించినావు ||త్రిత్వమై||
ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||
ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృప జూపినావు ||త్రిత్వమై||
కామెంట్‌ను పోస్ట్ చేయండి