a21

21

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||

  1. ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్ల దలంచెదను ||త్రిత్వమై||

  2. వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్ల గాచి రక్షించినావు ||త్రిత్వమై||

  3. ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||

  4. ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృప జూపినావు ||త్రిత్వమై||

Post a Comment

أحدث أقدم