a22

22

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వ్యోమ సింహాసనస్థుడ యుర్వి పాదపీఠస్థుడ మామకీన దయా మయుడ మమ్ముగావుమో దేవుడ ||వ్యోమ||

  1. అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప ||వ్యోమ||

  2. గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||

  3. నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దగా నా కాలమంతా ||వ్యోమ||

  4. సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||

  5. నమ్మిన యీనన్న తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతో జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ||

Post a Comment

أحدث أقدم