a25

25

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా అరయగా నీ ప్రేమ యింతన దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిను నే మరువ జాలను వరకృపా నిధి ||పరలోక||

  1. యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమున బడ ద్రోసిన నది న్యాయమౌ గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ||పరలోక||

  2. ఎన్నరాని మహిమ నుండి యేసు నన్ను బాలింప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసగె నాకు ||బరలోక||

Post a Comment

కొత్తది పాతది