a20

20

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింప గలరా ||పరిశుద్ధ||

  1. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ||

  2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ||

  3. పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ||

  4. జనక కుమారాత్మలను నేక దేవా ఘనమహిమ చెల్లును దనర నిత్యముగా ||పరిశుద్ధ||

Post a Comment

కొత్తది పాతది