a18

18

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||

  1. ఎచట నా ప్రియ భక్తులెలమి గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తునాధా ||కూడికొని||

  2. గత కాలమందున గాని చేతలచే దుర్గతి నొంది యుండగా గనుగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి శాంతి నిడితివి యాత్మస్వరూపా ||కూడికొని||

  3. నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందు బరత గల్గి యరులకు శుభములు నిరతంబు జేయగ దిరత మా కొసగుము దేవుని ప్రియ తనయా ||కూడికొని||

  4. అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని||

  5. అమలుడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాడ వాత్మజులకు నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు వేగంబు మా తండ్రీ ||కూడికొని||

Post a Comment

కొత్తది పాతది