19
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||
జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున ||చూడ||
పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ||
నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ||
ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||
కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి