a10

10

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||

  1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజు డెవ్వడు ||ఎంత||

  2. మనమున దలపోయ నూహకంద దెంతయున్ దాని జనువుగ జగమందు బొగడ మాట లందవే ||ఎంత||

  3. దేవదూతలైన దాని బాడలేరట యింక దేవుడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||

  4. ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే ప్రభు జెంతజేరి సంత తంబు ప్రీతి జేసెదన్ ||ఎంత||

Post a Comment

కొత్తది పాతది