a11

11

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు గరములు చక్కగా నీవైపు ||చూచు||

  1. మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకు బ్రేమను జూపితివి ||చూచు||

  2. నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణు జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు ఘన మైన నీ కృప ||చూచు||

  3. నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||

  4. దయజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోర దయజూపి మన్నించు దయగల మా తండ్రి ||చూచు||

Post a Comment

కొత్తది పాతది