10
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజు డెవ్వడు ||ఎంత||
మనమున దలపోయ నూహకంద దెంతయున్ దాని జనువుగ జగమందు బొగడ మాట లందవే ||ఎంత||
దేవదూతలైన దాని బాడలేరట యింక దేవుడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||
ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే ప్రభు జెంతజేరి సంత తంబు ప్రీతి జేసెదన్ ||ఎంత||
إرسال تعليق