శీర్షిక లేదు

601

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఏక

    వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా వదనంబు లందు కో ప్రభో ||వందనం||

  1. ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం||

  2. ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం||

  3. దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||

  4. కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||

  5. మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||

    ✍ పులిపాక జగన్నాధము


    Vandhanambonarthumo Prabho Prabho- Vandha Nam Onarthumo Prabho Prabho Vandhanambu Thandri Thanaya Sudhdhaathmudaa – Vandhanambu Landhuko Prabho || Vandhanam ||

  1. Inni Naallu Dharanu Mammu Broachiyu - Kanna Thandri Minchi Epudu Kaachiyu = Enna Leni Dheevena – Lidu Nanna Yesuvaa – Anni Retlu Sthoathramu Livigo || Vandhanam ||

  2. Paatha Vathsarampu Paapamanthayu - Preethini Manninchi Mammu Kaavumu = Uuthanaabdhamuna Needhu – Neethi Nosagumaa – Dhaatha Kreesthu Naadha Rakshakaa || Vandhanam ||

  3. Dheva Maadhu Kaalu Sethu Lellanu – Seva Kaali Thanuvu Dhinamu Lanniyu Nee Vosangu Vendi Pasidi – Jnaana Mantha Nee – Sevakai Angeeka Rinchumaa || Vandhanam ||

  4. Koatha Koraku Dhaasa Janamun Pampumu – Ee Thari Maa Loatu Paatlu Theerchumu = Paathakambu Lella Maapi – Bheethi Baapumu – Khyaathi Nondhu Neethi Suurydaa || Vandhanam ||

  5. Maa Sabhalanu Pedhdha Chesi Penchumu – Ee Suvaartha Cheppa Sakthi Neeyumu= Moasa Puchchu Nandha Kaara – Mantha Throayumu – Yesu Krupan Kummarimpumu || Vandhanam ||

    ✍ Matthayi Samuyelu

Post a Comment

కొత్తది పాతది