601
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఏక
ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం||
ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం||
దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||
మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
✍ పులిపాక జగన్నాధము
-
Inni Naallu Dharanu Mammu Broachiyu - Kanna Thandri Minchi Epudu Kaachiyu = Enna Leni Dheevena – Lidu Nanna Yesuvaa – Anni Retlu Sthoathramu Livigo
|| Vandhanam ||
-
Paatha Vathsarampu Paapamanthayu - Preethini Manninchi Mammu Kaavumu =
Uuthanaabdhamuna Needhu – Neethi Nosagumaa – Dhaatha Kreesthu Naadha Rakshakaa
|| Vandhanam ||
-
Dheva Maadhu Kaalu Sethu Lellanu – Seva Kaali Thanuvu Dhinamu Lanniyu Nee Vosangu Vendi Pasidi – Jnaana Mantha Nee – Sevakai Angeeka Rinchumaa
|| Vandhanam ||
-
Koatha Koraku Dhaasa Janamun Pampumu – Ee Thari Maa Loatu Paatlu Theerchumu =
Paathakambu Lella Maapi – Bheethi Baapumu – Khyaathi Nondhu Neethi Suurydaa
|| Vandhanam ||
-
Maa Sabhalanu Pedhdha Chesi Penchumu – Ee Suvaartha Cheppa Sakthi Neeyumu= Moasa Puchchu Nandha Kaara – Mantha Throayumu – Yesu Krupan Kummarimpumu
|| Vandhanam ||
✍ Matthayi Samuyelu
إرسال تعليق