579
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||కేది||
- వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది||
- మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||
- పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది||
- ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||
కామెంట్‌ను పోస్ట్ చేయండి