ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన

579

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను కిదియె తరుణమీయరమ్ము ||

  1. అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||కేది||

  2. వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది||

  3. మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||

  4. పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది||

  5. ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||

Post a Comment

أحدث أقدم