666
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||
- గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||
- రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||
- నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు... తుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||
- వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ ||నా ప్రాణ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి