665
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||
- అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||
- అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||
- రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||
- గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||
- ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||
- తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||
కామెంట్‌ను పోస్ట్ చేయండి