నా ప్రియ యేసునిపై ఆనుకొని

667

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటయే ఆనంద జీవితము ||నా||

  1. లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ ||నా||

  2. కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను ||నా||

  3. ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ ||నా||

  4. నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్ ||నా||

  5. అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు ||నా||

  6. దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును ||నా||

Post a Comment

కొత్తది పాతది