6

6

రాగం - కాంభోజి తాళం - ఆది

    భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||

  1. మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||

  2. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిం దా నొక్కడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||

  3. పుట్టగిట్టంజేయదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||

  4. మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||

  5. మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లు దిరుగజేర్పన్ మందను ||భీకరుండౌ||
akk 1

Post a Comment

కొత్తది పాతది