15

4

రాగం - కాంభోజి తాళం - ఆది

    యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతో బ్రోచి నన్ను మనుపు నాతడే||

  1. పచ్చికగల చోట్ల నను పరుండజేయుచు గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతడే||

  2. శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుడు అతడే||

  3. గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిక నా తోడు ఆయనే||

  4. దుడ్డుకఱ్ఱతో శత్రువుల దరుమగొట్టుచు దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||

  5. అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతో గడు విందు లొసగి తృప్తిపరుచు విభుడు ఆయనే||

  6. ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుడు నాకు బూయుచుండు సకల వేళలన్||

  7. బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును||

Post a Comment

కొత్తది పాతది