7
రాగం - కాంభోజి
తాళం - ఆది
సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో } 2
కన్న తండ్రి కావుమా
కలుషము నెడబాపుమా || సన్నుతింతుమో ||
- నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా } 2
పాతక జన రక్షకా } 2
పతిత పావన నామకా || సన్నుతింతుమో ||
- మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా } 2
దేవా మానవ నందనా } 2
దివ్య సుగుణ మందనా || సన్నుతింతుమో ||
- ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా } 2
కామిత ఫలదాయక } 2
స్వామి యేసు నాయక || సన్నుతింతుమో ||
- పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో } 2
నీ పవిత్ర నామమున్ } 2
నిరతము స్మరియించెదన్ || సన్నుతింతుమో ||
✍ బొంతా సమూయేలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి