92
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||
పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం
నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణం
కామెంట్‌ను పోస్ట్ చేయండి