a92

92

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం||

  1. దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||

  2. పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణంపరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం||

  3. నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణంతేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం

Post a Comment

أحدث أقدم