a93

93

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో||

  1. సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో||

  2. పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో||

  3. దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో||

  4. పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో||

Post a Comment

أحدث أقدم