a69

69

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి||సర్వ||

  1. ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు||సర్వ||

  2. మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||

  3. కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోజేరండి||సర్వ||

  4. ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే||సర్వ||

  5. శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా||సర్వ||

Post a Comment

కొత్తది పాతది