69
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు||సర్వ||
మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||
కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోజేరండి||సర్వ||
ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే||సర్వ||
శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా||సర్వ||
إرسال تعليق