a73

73

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళమే||

  1. పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వద్యునకు||మంగళమే||

  2. దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు||మంగళమే||

  3. సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు||మంగళమే||

  4. యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు||మంగళమే||

  5. నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర రక్షకునకు||మంగళమే||

  6. పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||

Post a Comment

أحدث أقدم