a64

64

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంత ప్రేమించెనో దేవుడు మనపై నెంతదయజూపెనో వింతగల యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత||

  1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత||

  2. పెంటకుప్పమీద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి మింటిపై ఘనులతో గూర్చుండజేయ నీ మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత||

  3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||

  4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుడా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత||

  5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు డెట్టివాడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత||

Post a Comment

కొత్తది పాతది