a60

60

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకు దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగ జేర్చుకొనుము ||గొప్ప||

  1. నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాడవు భావమందు నిను దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేడుకొందు ||గొప్ప||

  2. చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాడవు సన్నుతుడగు యేసు నీదు సన్నిధి సున్నాడు గాన నన్ను గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||

  3. విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధముల దలచు చుందును బలుకులందుబనులయందు బలము జూపి నిన్ను గొలిచి యిలను నిన్ను బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||

  4. మీది రాజ్యమందు జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్ను గరుణచే సోదరులను గూడికొనుచు మోద మొప్పగ నీదు సేవ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||

Post a Comment

కొత్తది పాతది