60
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాడవు భావమందు నిను దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేడుకొందు ||గొప్ప||
చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాడవు సన్నుతుడగు యేసు నీదు సన్నిధి సున్నాడు గాన నన్ను గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||
విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధముల దలచు చుందును బలుకులందుబనులయందు బలము జూపి నిన్ను గొలిచి యిలను నిన్ను బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||
మీది రాజ్యమందు జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్ను గరుణచే సోదరులను గూడికొనుచు మోద మొప్పగ నీదు సేవ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||
إرسال تعليق