a495

495

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||

  1. క్షయమందు విత్తబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||

  2. లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను యేసు ప్రేమతో దాటించురా ||మరణ||

  3. ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి పరదైసునకు బోదుము ||మరణ||

  4. గగన వీధినండి యేసు గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||

  5. బూర రావ మాలకించి భూమి యెల్ల వణకురా వారధిలో మృతులు జీవ ధారులై లేచెదరురా ||మర||

  6. భక్తులు విశ్వాసమునకు ఫలము నొంద బోదురు ముర్తి కిరీటము ధరించి రక్తితో జీవింతురు ||మరణ||

  7. కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుడి మరణవిజయుడైన ప్రభుని చరణములు నుతించుడీ ||మర||

Post a Comment

కొత్తది పాతది