a491

491

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసును చూచుట యెన్నటికో పర వాసుడ నగుట యెన్నటికో భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను ||యేసును||

  1. బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరగుట యెన్నటికో ||యేసును||

  2. ధాత్రి గష్ట దుఃఖాబ్ధిని మన మిక ధాటిగ దాటుట యెన్నటికో మైత్రితోడ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును||

  3. కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగ దాల్చుట యెన్న టికో యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో ||యేసును||

  4. శోధన బాధల నీ ధర బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును||

  5. నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగ గుదురుట యెన్నటికో ||యేసును||

  6. జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో ||యేసును||

Post a Comment

కొత్తది పాతది