491
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరగుట యెన్నటికో ||యేసును||
- ధాత్రి గష్ట దుఃఖాబ్ధిని మన మిక ధాటిగ దాటుట యెన్నటికో మైత్రితోడ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును||
- కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగ దాల్చుట యెన్న టికో యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో ||యేసును||
- శోధన బాధల నీ ధర బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును||
- నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగ గుదురుట యెన్నటికో ||యేసును||
- జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో ||యేసును||
إرسال تعليق