494
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఇతడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశబూనుచు ||నిదుర||
- సన్నిధి జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన ||నిదుర||
- మరణ కాలంబున ధరలో క్రీస్తుని సిలువ దిరముగ జూచిన నరులందఱు వరదుడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగ జేరుచు గరము నేర్తురు ప్రేమ నచ్చట దరతరంబులు గడుచుచుండగ ||నిదుర||
- పరిశుద్ధుడగు దేవ పాదసన్నిధిలోన బరిపూర్ణానందము పాదు కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల నెమ్మది జిరదయాళుడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున ||నిదుర||
- యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని వాసులముగా జేసి వారల యాస దీర్చును మాట దప్పక ||నిదుర||
إرسال تعليق