485
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దికను మించి మీ రెదిరింపలేరు ద లచి చూడుడు దేవ కృపలో నుంచి నను గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||
- శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||
- కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నికను ఘనముగల దేవుని కుమారుడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచె జూడుడు ||సకలేంద్రియములారా||
- రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పస దరిగి ముది వైతి విపు డో రసనమా యిక దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసము గ్రోలుచు బ్రొద్దు బుచ్చెద ||సకలేంద్రియములారా||
- తను వాద్యంతము మూయ దగిన త్వగి
కామెంట్‌ను పోస్ట్ చేయండి