476
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని||
- శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన ||యేసుని||
- పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచే బిల్చెడి ||యేసుని||
- సకల శుభంబులు చక్కగ నిచ్చుచు సకలభక్తులను సమముగ జూచెడి ||యేసుని||
- తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా ||యేసుని||
- చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగబట్టిన ||యేసుని||
- లోకమంతయును లోబడుచుండగ నేక ప్రభువై యేలుచుండుమా ||యేసుని||
కామెంట్‌ను పోస్ట్ చేయండి