475
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కపట వేష భాష లెల్లను తొలంగ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన వెలిగి యుపరిభాగ మరియునట్టి ||వారె మంచి||
- నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో ||వారె మంచి||
కామెంట్‌ను పోస్ట్ చేయండి