a424

424

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శరణు శరణు యేసు దేవా నన్ను గరుణింపవే నిత్య జీవా పరమ దేవుని తనూ భవుడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప ||శరణు||

  1. దైవోగ్రమునకు బాత్రుడను విమల భావమునకే నసహ్యుడను గావరించిన పాప కర్ముడన్ కఠినుడన్ జానవలసిన యట్టి స్వామి ద్రోహు డ నయ్య ||శరణు||

  2. మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగ బాపముల్ వేడ్కను జేసితి ||శరణు||

  3. మోసంబులో జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని సిలువ నేమాత్రమైన నే నాసతో జూడని యన్యాయ పరుడను ||శరణు||

  4. నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలో ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె ||శరణు||

  5. నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతజేసిన దేనుగాదా నీతిమాలిన పాప నీచుడన్ దుష్టుడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు||

  6. కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు ||శరణు||

Post a Comment

కొత్తది పాతది